Vijayasai Reddy: ఇప్పటికే రెండు సార్లు జగన్ పై హత్యాయత్నాలు చేయించిన బాబు ఇప్పుడు స్వయంగా బెదిరిస్తున్నాడు: విజయసాయి

Vijayasai tweets on Chandrababu
  • చంద్రబాబులో ద్వేషం, కసి, అసూయ బుసలు కొడుతున్నాయన్న విజయసాయి
  • నిన్ను చంపితే ఏమవుతుంది జగన్ అంటూ బెదిరిస్తున్నాడని ఆరోపణ
  • నీ మనసులో కోరిక నెరవేరదు బాబూ అంటూ ట్వీట్

చంద్రబాబులో ద్వేషం, కసి, అసూయ బుసలు కొడుతున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పటికే రెండుసార్లు జగన్ ను అంతం చేయించేందుకు హత్యాయత్నాలు చేయించిన బాబు ఇప్పుడు తనే స్వయంగా "నిన్ను చంపితే ఏమవుతుంది జగన్" అంటూ బెదిరిస్తున్నాడని ఆరోపించారు. 

తన రాజకీయ జీవితం పరిసమాప్తం అవుతోందన్న ఆక్రోశంతో కడుపులోని మంటను బయటపెట్టుకుంటున్నాడని విమర్శించారు. జగన్ కు ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు నీ మనసులోని కోరిక నెరవేరదు బాబూ అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News