బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ బంధువు వాహనంలో రూ.1 లక్ష పట్టివేత
- బీబీ పాటిల్ సోదరుడి కుమారుడి వాహనంలో నగదు పట్టివేత
- పూణే నుంచి టెక్మల్ వస్తుండగా వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు
- జహీరాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీబీ పాటిల్
తనిఖీల్లో భాగంగా బీబీ పాటిల్ సోదరుని కుమారుడు అభినవ్ వాహనంలో నగదును గుర్తించారు. పూణే నుంచి టెక్మల్ వస్తుండగా అభినవ్ పాటిల్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేకపోవడంతో ఆయన వద్ద ఉన్న రూ.1 లక్షను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.