T20 World Cup 2024: 2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్.. జ‌ట్టును ప్ర‌క‌టించిన కివీస్‌!

New Zealand Squad for ICC Men T20 World Cup 2024 Announced
  • 15 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించిన న్యూజిలాండ్ క్రికెట్
  • మ‌రోసారి సీనియ‌ర్ ఆట‌గాడు కేన్ విలియ‌మ్స‌న్‌కు జ‌ట్టు ప‌గ్గాలు
  • ఈసారి కూడా నాణ్య‌మైన‌ ఆల్‌రౌండ‌ర్లు, బ్యాట‌ర్లు, బౌల‌ర్ల‌తో స‌మ‌తూకమైన‌ జ‌ట్టును ఎంపిక చేసిన కివీస్
ఈ ఏడాది జూన్‌లో జ‌ర‌గ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ 2024 కోసం న్యూజిలాండ్ క్రికెట్ 15 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించింది. మ‌రోసారి సీనియ‌ర్ ఆట‌గాడు కేన్ విలియ‌మ్స‌న్ సార‌థ్యంలో కివీస్ బ‌రిలోకి దిగ‌నుంది. ఇటీవ‌ల పాకిస్థాన్‌లో 5 టీ20 మ్యాచుల సిరీస్‌లో పాల్గొన్న పలువురు కొత్త ఆట‌గాళ్ల‌కు ఈ ప్ర‌పంచ‌క‌ప్ స్క్వాడ్‌లో న్యూజిలాంట్ అవ‌కాశం ఇచ్చింది. అలాగే ఎప్ప‌టిలానే ఈసారి కూడా నాణ్య‌మైన‌ ఆల్‌రౌండ‌ర్లు, బ్యాట‌ర్లు, బౌల‌ర్ల‌తో స‌మ‌తూకమైన‌ జ‌ట్టును ఎంపిక చేసింది. 

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు కివీస్ స్క్వాడ్ ఇదే..
1. కేన్ విలియ‌మ్స‌న్ (కెప్టెన్‌), 2. ఫిన్ అలెన్‌, 3. ట్రెంట్ బౌల్ట్‌, 4. మిచెల్ బ్రాస్‌వెల్‌, 5. మార్క్ ఛాంప్‌మ‌న్‌, 6. డ్వేన్ కాన్వే, 7. డారిల్ మిచెల్‌, 8. లూకీ ఫెర్గూస‌న్‌, 9. మ్యాట్ హెన్రీ, 10. జ‌మ్మీ నీశ‌మ్‌, 11. గ్లెన్ ఫిలిప్స్, 12. ర‌చిన్ ర‌వీంద్ర‌, 13. మిచెల్ శాంట్న‌ర్‌, 14. ఇష్ సోధీ, 15. టీమ్ సౌథీ
T20 World Cup 2024
New Zealand
Cricket
Sports News

More Telugu News