Samantha: పుట్టినరోజు నాడు సొంత బ్యానర్ పై చిత్రాన్ని ప్రకటించిన సమంత

Samantha announces her first picture in Telugu as producer
  • సమంత నిర్మాతగా తొలి తెలుగు చిత్రం
  • మా ఇంటి బంగారం అని టైటిల్ ఫిక్స్
  • ఫస్ట్ లుక్ పోస్టర్ పంచుకున్న సమంత 

ప్రముఖ నటి సమంత ఇవాళ తన 37వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె సూపర్ అప్ డేట్ ఇచ్చారు. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పేరిట సొంత బ్యానర్ స్థాపించిన సమంత... మా ఇంటి బంగారం పేరిట చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సమంత ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. 

చీరకట్టులో ఉన్న సమంత డబుల్ బ్యారెల్ గన్ పట్టుకుని ఉండడం ఈ పోస్టర్ లో చూడొచ్చు. మెడలో మంగళసూత్రం కూడా ఉంది. సమంత నిర్మాతగా తెలుగులో వస్తున్న తొలి చిత్రం ఇదే. త్వరలోనే ఇతర  తారాగణం వివరాలు ప్రకటించనున్నారు. మా ఇంటి బంగారం చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News