Moonshine Pub: పబ్‌లో పీకల దాకా తాగి యువతితో అసభ్య ప్రవర్తన.. అడ్డుకున్న యువకుడిపై దాడి

Drunk men Indecent behavior with young woman in Hyderabad Pub
  • ఫిలింనగర్‌లోని మూన్‌షైన్ పబ్‌లో ఘటన
  • యువకుల వీరంగంతో దద్దరిల్లిన పబ్
  • తుపాకితో బెదిరించి బీరుబాటిళ్లతో దాడిచేశారంటూ బాధితుల ఫిర్యాదు
  • గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఓ పబ్‌లో గత అర్ధరాత్రి కొందరు ఆకతాయిలు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. మూన్‌షైన్‌ పబ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పీకల వరకు మద్యం తాగిన యువకులు ఓ యువతితో డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు.

వారి ప్రవర్తపై ఆగ్రహం వ్యక్తం చేసిన యువతితో వచ్చిన యువకుడు వారిని బలంగా వెనక్కి నెట్టేశాడు. దీంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. అది మరింత పెద్దది కావడంతో ఒకరిపై ఒకరు కలబడి దాడిచేసుకున్నారు. ఆకతాయిల దాడిలో గాయపడిన ముగ్గురు యువకులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. నిందితులు తుపాకితో బెదిరించి బీరుబాటిళ్లతో కొట్టి గాయపర్చినట్టు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Moonshine Pub
Film Nagar
Hyderabad
Jubilee Hills

More Telugu News