Premikudu: మళ్లీ వచ్చేస్తున్న ప్రభుదేవా ‘ప్రేమికుడు’.. 1న 300 థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

Prabhu Deva Block Buster Movie Premikudu Re Release On May 1st
  • 30 ఏళ్ల క్రితం యువతను ఓ ఊపుఊపిన ‘ప్రేమికుడు’
  • లవ్, పొలిటికల్ డ్రామాగా వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన మూవీ
  • డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి సంగీతం అందించిన ఏఆర్ రెహమాన్
  • 4కే క్వాలిటీలో మళ్లీ విడుదల చేస్తున్న నిర్మాతలు రమణ, మురళీధర్
  • బుకింగ్స్‌కు అద్భుతమైన స్పందన
సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్-ప్రభుదేవా కాంబినేషన్‌లో మూడు దశాబ్దాల క్రితం వచ్చిన లవ్, పొలిటికల్ డ్రామా ‘ప్రేమికుడు’ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. నేటి యువతను దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని మళ్లీ గ్రాండ్‌గా రీరిలీజ్ చేస్తున్నారు. మే 1న 300కు పైగా థియేటర్లలో 4కే క్వాలిటీలో విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు రమణ, మురళీధర్ తెలిపారు. ఇప్పటికే ఓపెన్ అయిన బుకింగ్స్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోందని వారు తెలిపారు.

 ‘ప్రేమికుడు’ రీ రిలీజ్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  నిర్మాతలు మురళీధర్‌రెడ్డి, రమణ, లగడపాటి శ్రీనివాస్, శోభారాణి పాల్గొన్నారు. నగ్మ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో  ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి సంగీతం అందించారు. 30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా అప్పట్లో యువతనే కాకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. మ్యూజికల్ హిట్ అయిన ఈ సినిమాలోని పాటలు కూడా అప్పట్లో సెన్షేషన్ క్రియేట్ చేశాయి.   
Premikudu
Prabhudeva
Nagma
S. Shakar
AR Rehman
Premikudu Re Release

More Telugu News