Vijayasai Reddy: నా కుమార్తెతో మహిళలు వ్యవహరించిన తీరు చాలా సంతోషం కలిగించింది: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy daughter held meeting with women in Nellore
  • నెల్లూరు లోక్ సభ స్థానంలో వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి
  • నెల్లూరు క్యాంపు కార్యాలయంలో మహిళలతో విజయసాయి కుమార్తె ఆత్మీయ సమావేశం
  • మహిళలందరూ జగన్ వైపే ఉన్నారన్న విజయసాయి
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లోక్ సభ ఎన్నికల్లో నెల్లూరు స్థానం నుంచి పోటీ చేస్తుండడం తెలిసిందే. విజయసాయిరెడ్డి తరఫున ఆయన కుమార్తె కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దీనిపై విజయసాయిరెడ్డి స్పందించారు. 

"నెల్లూరు రామ్మూర్తినగర్ లోని నా క్యాంపు కార్యాలయంలో ఇవాళ మహిళలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో నా కుమార్తె నేహారెడ్డి కూడా పాల్గొంది. నా కుమార్తెతో మహిళలు స్పందించిన తీరు ఎంతో సంతోషాన్ని కలిగించింది" అని వెల్లడించారు. 

మహిళా సాధికారతే లక్ష్యంగా... మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయాలన్నదే జగన్ ఉద్దేశం అని విజయసాయి వివరించారు. నేటి ఆత్మీయ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. 

ఎక్కడికి వెళ్లినా మహిళలు జగన్ కే మద్దతు పలుకుతున్నారని వెల్లడించారు. సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలు తమ కుటుంబాల్లో వెలుగులు నింపాయని చెబుతున్నారని వివరించారు. 

ఆసరా, చేయూత వంటి పథకాలతో మహిళలను లక్షాధికారులను చేసి, సమాజంలో గౌరవ స్థానం కల్పించిన జగనన్ననే మళ్లీ గెలిపించుకుంటామని మహిళలందరూ అంటున్నారని విజయసాయి తెలిపారు.
Vijayasai Reddy
Lok Sabha Polls
Nellore
YSRCP

More Telugu News