Chinthamaneni Prabhakar: దెందులూరులో వైసీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారు: చింతమనేని ప్రభాకర్

Chinthamaneni Prabhakar fires on ysrcp
  • వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందన్న చింతమనేని
  • వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య
  • ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతోందన్న చింతమనేని

వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని... అందుకే దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. దెందులూరులో అరాచకాలు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. దాడులు వాళ్లే చేస్తూ... మళ్లీ టీడీపీ వాళ్లే చేసినట్టు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకెన్ని రోజులు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల 13వ తేదీన దెందులూరు నియోజకవర్గం ప్రజలు టీడీపీకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించబోతున్నారని చెప్పారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారికి ప్రజలు బుద్ది చెపుతారని అన్నారు.

  • Loading...

More Telugu News