Varun Tej: తల్లిదండ్రులతో కలిసి పిఠాపురంలో కుక్కుటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్న వరుణ్ తేజ్

Varun Tej offers special prayers in Pithapuram Kukkuteswara Swami temple
  • నేడు పిఠాపురం వచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్
  • బాబాయి పవన్ కల్యాణ్ కోసం ఎన్నికల ప్రచారం
  • కుక్కుటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వరుణ్ తేజ్
టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి పిఠాపురం వచ్చారు. ఆయన తన బాబాయి పవన్ కల్యాణ్ కోసం నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో, తల్లిదండ్రులు కొణిదెల పద్మ, నాగబాబులతో కలిసి వరుణ్ తేజ్ పిఠాపురంలోని సుప్రసిద్ధ శ్రీ కుక్కుటేశ్వరస్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఇక్కడ కుక్కుటేశ్వరస్వామి, దత్తాత్రేయస్వామి, రాజరాజేశ్వరిదేవి, పురుహూతికా దేవి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణ్ తేజ్ కాసేపట్లో రోడ్ షోలో పాల్గొననున్నారు.
Varun Tej
Pithapuram
Pawan Kalyan
Nagababu
Janasena

More Telugu News