Jagan: వైసీపీ మేనిఫెస్టో వచ్చేస్తోంది.. నేడు విడుదల చేయనున్న జగన్

Jagan to release YSRCP manifesto today
  • తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్న జగన్
  • నవరత్నాలను అప్ గ్రేడ్ చేసేలా ఉండబోతున్న మేనిఫెస్టో
  • పారిశ్రామికీకరణ, ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం

నేడు వైసీపీ మేనిఫెస్టో విడుదల కాబోతోంది. పార్టీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టో విడుదల కార్యక్రమం ఉంటుంది. ఓటర్లను ఆకట్టుకునేలా మేనిఫెస్టో ఉండబోతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు... ఈ ఐదేళ్లలో ప్రజలను ఆకట్టుకున్న అన్ని పథకాలను కూడా మేనిఫెస్టోలో ఉంచబోతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నవరత్నాలను అప్ గ్రేడ్ చేసేలా మేనిఫెస్టో ఉండబోతోంది. 

వీటితో పాటు పారిశ్రామికీకరణ, ఉద్యోగాల కల్పనపై కూడా మేనిఫెస్టోలో ప్రాధాన్యతను ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వైసీపీ మేనిఫెస్టోకు సంబంధించిన వివరాలు బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో, మేనిఫెస్టో ఎలా ఉండబోతోందనే అంశంపై ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News