BJP: ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి నామినేషన్‌పై కాంగ్రెస్, బీఎస్పీ అభ్యంతరం

Congress objects Adilabad bjp candidate nomination
  • నామినేషన్ దాఖలులో నగేశ్ నిబంధనలు పాటించలేదంటున్న కాంగ్రెస్
  • తమ ఫిర్యాదును ఎన్నికల అధికారి స్వీకరించలేదంటున్న కాంగ్రెస్, బీఎస్పీ
  • బరిలో బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు, కాంగ్రెస్ నుంచి ఆత్రం సగుణ
ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నామినేషన్ ఆమోదంపై కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలు అభ్యంతరం తెలిపాయి. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున గోడెం నగేశ్ పోటీ చేస్తున్నారు. అయితే ఆయన నామినేషన్ ఆమోదం తెలపడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నామినేషన్ దాఖలులో నగేశ్ నిబంధనలు పాటించలేదని చెబుతున్నారు. ఈ అంశంపై తమ ఫిర్యాదును ఎన్నికల అధికారి స్వీకరించలేదని ఆరోపిస్తున్నారు. ఆదిలాబాద్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరఫున నగేశ్, కాంగ్రెస్ తరఫున ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు బరిలో ఉన్నారు.
BJP
Telangana
Lok Sabha Polls
Adilabad District

More Telugu News