Thotapalli Madhu: ప్రకాశ్ రాజ్ కి అలా కలిసొచ్చింది: రచయిత తోటపల్లి మధు

Thotapalli Madhu Interview
  • జయసుధ సీరియల్ కి పనిచేశానన్న మధు
  • ఆమె పాతిక వేలు ఇచ్చారని వెల్లడి 
  • ఆ సీరియల్ లో ప్రకాశ్ రాజ్ చేసేవాడని వివరణ 
  • అలా అతను 'డ్యూయెట్' సినిమా చేశాడని వ్యాఖ్య

రచయితగా తోటపల్లి మధు చాలా సినిమాలకి పనిచేశారు. ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. జయసుధగారి బ్యానర్లో నేను ఒక టీవీ సీరియల్ కి పనిచేశాను. ఆ సీరియల్ కి దర్శకురాలిగా జయసుధ పేరు ఉండేది. ఎంత ఇస్తారని నేను అడిగితే, 'సీరియల్ కి కూడా డబ్బులు ఏమిటండీ' అని ఆమె అన్నారు. 'నాతో ఎవరైనా లవ్ లెటర్ రాయించుకున్నా డబ్బులు తీసుకుంటాను' అని నేను అన్నాను" అని చెప్పారు. 

"జయసుధగారు ఆ సీరియల్ కి నాకు పాతిక వేలు ఇచ్చారు. ఆ సీరియల్ లో ప్రకాశ్ రాజ్ నటించేవారు. ఆయన పేరు ప్రకాశ్ రాజ్ కాదు .. ప్రకాశ్ రే. ప్రతిరోజూ ఇద్దరం కలిసి మాట్లాడుకునేవాళ్లం. తనకి బాలచందర్ సినిమాలో ఛాన్స్ వచ్చిందనీ, ఈ సీరియల్ కారణంగా వెళ్లలేకపోతున్నానని ప్రకాశ్ రాజ్ బాధపడేవాడు. సరేలే ఏదో ఒకటి చేద్దాంలే అని నేను అనేవాడిని"

"ఆ మరునాడు కథలోని ట్విస్టుల గురించి మాట్లాడుతూ, ప్రకాశ్ రాజ్ పాత్ర చనిపోతుందని నేను జయసుధ దంపతులతో అన్నాను .. అందుకు వాళ్లు ఒప్పుకున్నారు. ప్రకాశ్ రాజ్ పాత్రను చంపడం వలన, ఆ మరుసటి రోజు తరువాత అతనిపై ఎలాంటి సీన్స్ లేవు. దాంతో అతను వైజాగ్ లో జరిగే 'డ్యూయెట్' సినిమాకి వెళ్లిపోయాడు. ఆ సినిమాతోనే ప్రకాశ్ రాజ్ కి బాగా కలిసొచ్చింది" అని చెప్పారు.

  • Loading...

More Telugu News