Dokka Manikya Varaprasad: వైసీపీకి సీనియ‌ర్ నేత డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ గుడ్‌బై!

Dokka Manikya Varaprasad quits YSRCP
  • పార్టీ క్రియాశీల‌క‌ స‌భ్య‌త్వంతో పాటు గుంటూరు జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసిన డొక్కా
  • రాజీనామా లేఖ‌ను వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి పంపిన సీనియ‌ర్ నేత‌
  • తాడికొండ టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డ వైనం
  • అక్క‌డ మాజీ మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌కు టికెట్ కేటాయించిన వైసీపీ
అధికార వైసీపీకి ఎన్నికల ముందు మ‌రో షాక్ త‌గిలింది. ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ వైసీపీని వీడారు. పార్టీ క్రియాశీల‌క‌ స‌భ్య‌త్వంతో పాటు గుంటూరు జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను వైసీపీ అధినేత‌,  సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి పంపించారు. 

కాగా, డొక్కా తాడికొండ టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డారు. అక్క‌డ మాజీ మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌కు వైసీపీ టికెట్ కేటాయించింది. దీంతో మ‌న‌స్తాపం చెందిన ఆయ‌న గ‌త కొన్నిరోజులుగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే శుక్ర‌వారం పార్టీకి గుడ్‌బై చెప్పారు.
Dokka Manikya Varaprasad
YSRCP
Andhra Pradesh
AP Politics

More Telugu News