Ponnam Prabhakar: రాజీనామా చేసేందుకు హరీశ్ రావు సిద్ధంగా ఉండాలి: పొన్నం ప్రభాకర్

Harish Rao to be prepared for resignation says Ponnam Prabhakar
  • 2023లో రుణమాఫీ చేస్తామని హరీశ్ అన్నారన్న పొన్నం
  • రుణమాఫీ చేశారా అని ప్రశ్న
  • రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ను అన్ని స్థానాల్లో గెలిపించాలని విన్నపం
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. 2023లో రుణమాఫీ చేస్తామని హరీశ్ రావు అన్నారని.. రుణమాఫీ చేశారా? అని ప్రశ్నించారు. ఆగస్ట్ 15లోపు రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. రాజీనామా చేసేందుకు హరీశ్ రావు సిద్ధంగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ను మొత్తం 17 స్థానాల్లో గెలిపించాలని అన్నారు. కరీంనగర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న బండి సంజయ్, బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న వినోద్ కుమార్ ఎప్పుడైనా గ్రామాల్లోకి వచ్చారా? అని ప్రశ్నించారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ తరపున పొన్నం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Ponnam Prabhakar
Congress
Harish Rao
BRS

More Telugu News