BJP: ఏపీ పోలీసు అధికారులపై ఈసీకి మరోసారి బీజేపీ ఫిర్యాదు

BJP once again complained to the EC against the AP police officers
  • డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయాలంటూ అభ్యర్థన
  • పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కొందరు అధికారులు వినియోగించుకోనివ్వడంలేదని ఆరోపణ
  • పోస్టల్ బ్యాలెట్ గడువుని మరింత పొడిగించాలని ఈసీకి విజ్ఞప్తి
రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల్లో వైఫల్యం ఉన్నా, రాజకీయ నేతలపై దాడులు జరుగుతున్నా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పట్టించుకోవటం లేదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఏపీ డీజీపీని బదిలీ చేయాలంటూ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో ఈ మేరకు బీజేపీ నేతలు మరోసారి ఫిర్యాదు చేశారు. రాజేంద్రనాథ్‌రెడ్డిని తప్పించాలని ఇప్పటికే రెండు సార్లు ఫిర్యాదు చేశామని ప్రస్తావించారు. 

ఏపీలో కొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌‌లు రాజకీయ సేవా అధికారులుగా మారిపోయారని బీజేపీ సీనియర్‌ నేత భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ల జారీలో ఎన్నికల అధికారులు నిబంధనలు పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఉపయోగించుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, అత్యవసర సర్వీసుల్లో ఉన్న 10 లక్షల మందికి పోస్టల్‌ ఓట్లు ఉన్నాయని, ఈ వ్యవహారంపై విచారణ జరిపి పోస్టల్‌ బ్యాలెట్ల గడువు సమయాన్ని మరింత పొడగించాలని భానుప్రకాశ్ రెడ్డి కోరారు.
BJP
AP Assembly Polls
AP DGP
Andhra Pradesh

More Telugu News