Gundu Sudha Rani: బీఆర్ఎస్‌కు భారీ షాక్... కాంగ్రెస్‌లో చేరిన వరంగల్ మేయర్ గుండు సుధారాణి

Warangal Mayor Gundu Sudharani joined Congress Party
  • జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న సుధారాణి
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగ్గారెడ్డి
  • కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా గుండు సుధారాణి

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. గురువారం వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జగ్గారెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇటీవల బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. కేటీఆర్ వరంగల్ పర్యటనలో ఆమె కనిపించలేదు. దీంతో ఆమె పార్టీని వీడుతారనే ప్రచారం సాగింది. గుండు సుధారాణి 2002 నుంచి 2004 వరకు టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఉన్నారు. 2010లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో ఆమె టీడీపీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

  • Loading...

More Telugu News