Telangana: తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 547 నామినేషన్లు

  • రేపు నామినేషన్ల ప్రక్రియ... 29వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు
  • మే 13న పోలింగ్, జూన్ 4న ఎన్నికల ఫలితాలు
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు లోక్ సభ స్థానాలకు 120కి పైగా నామినేషన్లు

తెలంగాణలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం ముగిసింది. 17 లోక్ సభ స్థానాలకు గాను 547 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 18న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు డమ్మీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు కూడా చాలామంది నామినేషన్లు దాఖలు చేశారు. రేపు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ... 29వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. మే 13న పోలింగ్, జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.

ఖమ్మం లోక్ సభ స్థానానికి 29 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు లోక్ సభ స్థానాలకు 120కి పైగా నామినేషన్లు వచ్చాయి. ఈరోజు చివరి రోజు... దీనికి తోడు మంచి రోజు కావడంతో ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యాయి. కొంతమంది అభ్యర్థులు రెండు లేదా మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడి నుంచి 13 నామినేషన్లు దాఖలయ్యాయి.

More Telugu News