Actor Nikhil: కూట‌మి అభ్య‌ర్థికి మ‌ద్ద‌తుగా.. చీరాల‌లో హీరో నిఖిల్ ప్ర‌చారం

Tollywood Actor Nikhil in Election Rally at Chirala
  • చీరాల నియోజ‌క‌వ‌ర్గ‌ ఎన్‌డీఏ కూట‌మి అభ్య‌ర్థి ఎం కొండ‌య్య ఎన్నిక‌ల ర్యాలీలో పాల్గొన్న నిఖిల్  
  • ఈ ర్యాలీలో భాగంగా గ‌డియార స్తంభం కూడ‌లిలో ప్ర‌సంగించిన టాలీవుడ్ యంగ్ హీరో 
  • చిరు న‌వ్వుల చీరాల కావాలంటే కూట‌మి అభ్య‌ర్థికి ఓటు వేసి గెలిపించాల‌ని అభ్య‌ర్థించిన వైనం
  • రాష్ట్ర అభివృద్ధి చంద్ర‌బాబు నాయుడుతోనే సాధ్య‌మ‌న్న న‌టుడు
బాప‌ట్ల జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గ‌ ఎన్‌డీఏ కూట‌మి అభ్య‌ర్థి ఎం కొండ‌య్యకు మ‌ద్ద‌తుగా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నాడు. కొండ‌య్య గురువారం చీరాల అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు. అంత‌కుముందు ఆయ‌న చీరాల మండ‌ల ప‌రిధిలోని హస్తినాపురంలోని గ‌ణేశుడి ఆల‌యం నుంచి చీరాల వ‌ర‌కు భారీ ర్యాలీ నిర్వ‌హించ‌డం జ‌రిగింది. 

ఈ ర్యాలీలో న‌టుడు నిఖిల్‌తో పాటు టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా నిఖిల్‌తో ఫొటోలు దిగేందుకు జ‌నాలు ఎగ‌బడ్డారు. ఆయ‌న కూడా వారితో చేతులు క‌లిపి, సెల్ఫీలు దిగారు. ఈ ర్యాలీలో భాగంగా గ‌డియార స్తంభం కూడ‌లిలో నిఖిల్ ప్ర‌సంగించారు. చిరు న‌వ్వుల చీరాల కావాలంటే కూట‌మి అభ్య‌ర్థి కొండ‌య్య‌కు ఓటు వేసి గెలిపించాల‌ని ఓట‌ర్ల‌ను అభ్య‌ర్థించారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి చంద్ర‌బాబు నాయుడుతోనే సాధ్య‌మ‌ని నిఖిల్ అన్నారు.
Actor Nikhil
Tollywood
Election Rally
Chirala
Andhra Pradesh
AP Politics

More Telugu News