Mekapati Rajamohan Reddy: టీడీపీతో పొత్తు మోదీకి ఇష్టం లేదు.. ఆయన కాళ్లు పట్టుకుని పొత్తు పెట్టుకున్నారు: మేకపాటి రాజమోహన్ రెడ్డి

Better Chandrababu quit politics says Mekapati
  • చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారన్న మేకపాటి
  • చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవడం మంచిదని సూచన
  • జగన్ లో ఉన్న నాయకత్వ లక్షణాలు మరెవరిలో లేవని కితాబు
టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు వయసు పైబడి, మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి పిల్ల బచ్చా అని చంద్రబాబు అనడం ఆయన అహంకారానికి నిదర్శనమని అన్నారు. ఆ పిల్ల బచ్చా దెబ్బకే చంద్రబాబు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవడం మంచిదని సూచించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటేనే చంద్రబాబుకు గౌరవంగా ఉంటుందని చెప్పారు. 

టీడీపీతో పొత్తు పెట్టుకోవడం మోదీకి ఇష్టం లేదని... మోదీ కాళ్లు పట్టుకుని చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని అన్నారు. నారా లోకేశ్ ఒక సోంబేరి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పై రాయితో హత్యాయత్నం జరిగిన తర్వాత... ఆ ఘటనపై లోకేశ్ స్పందించిన తీరు సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ లో ఉన్న నాయకత్వ లక్షణాలు ఎవరిలో లేవని కితాబునిచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీ 175కి 175 స్థానాలను, 25కి 25 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటుందని చెప్పారు. 

Mekapati Rajamohan Reddy
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
Narendra Modi
BJP
AP Politics

More Telugu News