ఇండియాలోనే అత్యంత ఖరీదైన టీ.. కిలో టీ పోడి ధర అక్షరాల రూ. 1.50 లక్షలు
- పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో దొరికే ఖరీదైన టీ
- టీకి ఉండే ప్రత్యేకమైన నాణ్యత, రుచినే అంత ఖరీదుకు కారణం
- ప్రత్యేకమైన టేస్ట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ టీ
ఒక కిలో టీ పోడి ధర అక్షరాల రూ. 1.50 లక్షలు. అవును, మీరు విన్నది నిజమే. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఇండియాలోనే అత్యంత ఖరీదైన ఈ టీ దొరుకుతుంది. ఇంత ఖరీదుకు కారణం ఆ టీకి ఉండే ప్రత్యేకమైన నాణ్యత, రుచినే కారణం.
కాగా, ఈ టీ భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ వ్యసనపరులు ఒక్కసారైనా ఈ ప్రత్యేకమైన టీని టేస్ట్ చేయాలని పరితపిస్తుంటారట. ఇక ఈ టీని రుచి చూడాలంటే మాత్రం డార్జిలింగ్‌లో ఎప్పుడూ సందడిగా ఉండే మాల్ రోడ్ ప్రాంతంలో ఉన్న ఒక దుకాణానికి వెళ్లాల్సిందే.