manish Tiwari: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మన దేశానికి ఇవే చివరి ఎన్నికలు: మనీశ్ తివారి

Manish Tiwari says these are last elections if bjp come again
  • మోదీని నిలువరించడానికి ఇండియా కూటమి ఏర్పడిందన్న మనీశ్
  • అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడేందుకు తాము ఎన్నికల బరిలో నిలుస్తున్నామని వ్యాఖ్య
  • దేశంలో మార్పు తథ్యమని తాము తొలిదశ పోలింగ్ నుంచే చెబుతున్నామన్న కాంగ్రెస్ నేత
  • బీజేపీ దక్షిణాన కనుమరుగు అవుతుంది... ఉత్తరాదిన సగానికే పరిమితమవుతుందని జోస్యం
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మన దేశానికి ఇవే చివరి ఎన్నికలు అవుతాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మనీశ్ తివారి హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నియంత పాలన సాగిస్తున్నారన్నారు. అందుకే ఆయనను నిలువరించడానికి ఇండియా కూటమి ఏర్పడిందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడేందుకు తాము ఎన్నికల బరిలో నిలుస్తున్నామని వ్యాఖ్యానించారు.

బీజేపీ కనుక మూడోసారి గెలిస్తే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతుందని వ్యాఖ్యానించారు. జూన్ 4న విపక్ష ఇండియా కూటమి అధికారం చేజిక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మార్పు తథ్యమని తాము తొలిదశ పోలింగ్ నుంచే చెబుతున్నామన్నారు. బీజేపీ దక్షిణాన కనుమరుగు అవుతుందని... ఉత్తరాదిన సగానికే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు.
manish Tiwari
Congress
BJP
Lok Sabha Polls
Narendra Modi

More Telugu News