Pawan Kalyan: ఎన్నిక‌ల ర్యాలీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ డ్యాన్స్.. వీడియో వైర‌ల్‌!

Janasena President Pawan Kalyan Dance in Election Nomination Rally
  • కాకినాడ జ‌న‌సేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న జ‌న‌సేనాని
  • ఈ సంద‌ర్భంగా డ్యాన్స్ చేసి జనసైనికుల్లో జోష్ నింపిన ప‌వ‌న్‌
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియో

ఎన్నిక‌ల నామినేష‌న్ ర్యాలీలో జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ డ్యాన్స్ చేశారు. కాకినాడ జ‌న‌సేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ ర్యాలీలో ప‌వ‌న్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జనసేనాని డ్యాన్స్ చేసి జనసైనికుల ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక ప‌వ‌న్ మంగ‌ళ‌వారం పిఠాపురం ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు. కాగా, టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు 21 అసెంబ్లీ, 2 పార్ల‌మెంట్ సీట్లు ద‌క్కిన సంగ‌తి తెలిసిందే.

  • Loading...

More Telugu News