Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్‌కు బీసీసీఐ ప్ర‌త్యేక బ‌ర్త్‌డే విషెస్‌

BCCI Extends Heartfelt Birthday Wishes to India Cricket Legend Sachin Tendulkar As He Turns 51
  • నేడు సచిన్ టెండూల్కర్ 51వ బ‌ర్త్‌డే 
  • స‌చిన్ త‌న 24 ఏళ్ల‌ క్రికెట్ కెరీర్‌లో ఆడిన 664 అంత‌ర్జాతీయ మ్యాచులు
  • ఆ మ్యాచుల్లో చేసిన 34,357 ప‌రుగులు
  • పార్ట్‌టైమ్ బౌల‌ర్‌గా తీసిన 201 వికెట్లు 
  • 2011లో వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ బీసీసీఐ ట్వీట్‌
క్రికెట్ దేవుడు, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్కర్ నేడు 51వ బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) ఆయ‌న‌కు ఎక్స్ వేదిగా ప్ర‌త్యేకంగా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. స‌చిన్ త‌న 24 ఏళ్ల‌ క్రికెట్ కెరీర్‌లో ఆడిన 664 అంత‌ర్జాతీయ మ్యాచులు, ఆ మ్యాచుల్లో చేసిన 34,357 ప‌రుగులు, పార్ట్‌టైమ్ బౌల‌ర్‌గా తీసిన 201 వికెట్ల‌తో పాటు 2011లో వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ క్రికెట్ బోర్డు స‌చిన్‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలిపింది. అలాగే అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి 100 శ‌తకాలు బాదిన ఏకైక క్రికెట‌ర్ అని పేర్కొంది. క్రికెట్ లెజెండ్‌కు ఇవే మా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అని ట్వీట్ చేసింది.
Sachin Tendulkar
BCCI
Birthday Wishes
Cricket
Sports News

More Telugu News