Swami Paripoornananda: హిందూపురంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద

Swami Paripoornananda files nomination for Hindupur assembly constituency
  • నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించిన పరిపూర్ణానంద
  • హిందూపురం నుంచి బీజేపీ టికెట్ ఆశించిన స్వామీజీ
  • పొత్తులో భాగంగా టీడీపీకి హిందూపురం టికెట్
  • మరోసారి పోటీ చేస్తున్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ బరిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి పరిపూర్ణానంద నేడు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. 

పరిపూర్ణానంద ఈ ఎన్నికల్లో బీజేపీ టికెట్ లభిస్తుందని ఆశించారు. అయితే హిందూపురం నుంచి కూటమి అభ్యర్థిగా, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, పరిపూర్ణానంద స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. 

హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా టీఎన్ దీపిక పోటీ చేస్తుండడం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థిగా వి.నాగరాజు పోటీ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News