Pawan Kalyan: ఆర్ఓ కార్యాల‌యంలో ప‌వ‌న్ ప్ర‌మాణం.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

Janasena President Pawan Kalyan take oath in RO office Video goes Viral on Social Media
  • పిఠాపురం ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌  
  • జ‌న‌సేనానితో ప్ర‌మాణం చేయించిన రిట‌ర్నింగ్ అధికారి 
  • 'కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను' అంటూ ప్ర‌మాణం చేసిన జ‌న‌సేన అధినేత‌
జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌సేనానితో రిట‌ర్నింగ్ అధికారి ప్ర‌మాణం చేయించారు. 'కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను' అంటూ ఆయ‌న ప్ర‌మాణం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను జ‌న‌సేన పార్టీ సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేయ‌డంతో ఇప్పుడ‌ది వైర‌ల్ అవుతోంది. ఇక నామినేష‌న్ వేసేందుకు వ‌చ్చిన ప‌వ‌న్ వెంట ఆయ‌న సోద‌రుడు నాగ‌బాబు, ఎస్‌వీఎస్ఎన్ వ‌ర్మ ఉన్నారు. అంత‌కుముందు ప‌వ‌న్ జ‌న సైనికుల‌తో క‌లిసి భారీ ర్యాలీగా ఆర్ఓ కార్యాల‌యానికి వెళ్లారు.
Pawan Kalyan
Janasena
Pithapuram
AP Politics

More Telugu News