తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలకు బుద్ధి చెప్పాలి: కేటీఆర్
- రాజేంద్రనగర్ లో కేటీఆర్ రోడ్ షో
- కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపు
- బీజేపీకి 200 సీట్లు కూడా రావని జోస్యం
బీఆర్ఎస్ కు 8 నుంచి 10 ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో ఉన్న ఏ పార్టీ అయినా మన మాట వింటుందని కేటీఆర్ చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 400 కాదు.. 200 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్ కు 100 నుంచి 150 సీట్లు కూడా రావని చెప్పారు. అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసే కాంగ్రెస్ పార్టీని అందరూ నిలదీయాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ గత పదేళ్లలో తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు. చేవెళ్ల లోక్ సభ పరిధిలోని రాజేంద్రనగర్ లో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పైవ్యాఖ్యలు చేశారు.