Vijayashanthi: 'విశ్వంభర'లో విజయశాంతి!

Vijayashanthi in Vishwambhara Movie
  • షూటింగు దశలో ఉన్న 'విశ్వంభర'
  • చిరంజీవి సరసన కనిపించనున్న విజయశాంతి 
  • సంగీతాన్ని సమకూర్చుతున్న కీరవాణి 
  • జనవరి 10వ తేదీన విడుదల

వెండితెరపై విజయశాంతి తిరుగులేని కథానాయికగా కొనసాగారు. లేడీ అమితాబ్ గా యాక్షన్ సినిమాలలోను రాణించారు. రాజకీయాలలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆమె నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. చాలా గ్యాప్ తరువాత 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి విజయశాంతి వరుస సినిమాలు చేస్తారని అనుకున్నారు .. కానీ అలా జరగలేదు. 

మళ్లీ ఇప్పుడు 'విశ్వంభర' సినిమా విషయంలో ఆమె పేరు వినిపిస్తోంది. చిరంజీవి కథానాయకుడిగా శ్రీవశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' రూపొందుతోంది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఫాంటసీ నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రధానమైన నాయికగా త్రిష కనిపించనుంది. చిరంజీవి - త్రిష ఇద్దరూ కూడా 'స్టాలిన్' తరువాత కలిసి నటిస్తున్న సినిమా ఇది. 

'విశ్వంభర'లో ఒక కీలకమైన పాత్ర ఉందట. ఆ పాత్రను విజయశాంతి చేస్తే బాగుంటుందని భావించిన టీమ్, ఆమెను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. గతంలో చిరంజీవి - విజయశాంతి కాంబినేషన్లో కొన్ని సూపర్ హిట్స్ వచ్చాయి. చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఈ ఇద్దరినీ ఒకే తెరపై ప్రేక్షకులు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, జనవరి 10వ తేదీన  విడుదల కానుంది. 

  • Loading...

More Telugu News