Volunteers: వాలంటీర్ల రాజీనామాలపై పిటిషన్... హైకోర్టులో విచారణ వాయిదా

High Court adjourns hearing on volunteers resignations issue
  • ఏపీలో త్వరలో ఎన్నికలు
  • ఇటీవల రాజీనామా చేసిన కొందరు వాలంటీర్లు
  • ఎన్నికలు ముగిసేంతవరకు వారి రాజీనామాలు ఆమోదించవద్దంటూ హైకోర్టులో పిటిషన్
ఇటీవల జరిగిన పరిణామాలతో ఏపీలో కొందరు వాలంటీర్లు రాజీనామాలు చేయడం తెలిసిందే. అయితే, ఎన్నికలు ముగిసేవరకు వారి రాజీనామాలు ఆమోదించవద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ వాలంటీర్ల రాజీనామాలు ఆమోదిస్తే, వారు ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేస్తారంటూ బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. 

ఈ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. వాలంటీర్ల రాజీనామాలు అంగీకరిస్తే, వారు వైసీపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం... రాజీనామా చేసిన వాలంటీర్ల వివరాలు ఇవ్వాలని ఈసీని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
Volunteers
Resignations
AP High Court
YSRCP
Andhra Pradesh

More Telugu News