Btech Ravi: ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్య గురించి మాట్లాడొద్దన్న కడప కోర్టు.. హైకోర్టులో బీటెక్ రవి అప్పీల్

Btech Ravi appeal in High Court on Kadap court orders on YS Viveka
  • లంచ్ మోషన్ పిటిషన్ వేసిన బీటెక్ రవి
  • పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకమన్న రవి
  • రేపు విచారణ జరుపుతామన్న హైకోర్టు
ఎన్నికల ప్రచారం సందర్భంగా వైఎస్ వివేకా హత్య, ఇతర పెండింగ్ కేసుల గురించి ఎవరూ మాట్లాడొద్దని కడప కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి ఏపీ హైకోర్టులో అప్పీల్ చేశారు. బీటెక్ రవి తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19కి, పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకమని పిటిషన్ లో బీటెక్ రవి పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషన్ పై రేపు విచారణ జరుపుతామని తెలిపింది.
Btech Ravi
YS Vivekananda Reddy
Telugudesam

More Telugu News