Sunil Narine: టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో రీఎంట్రీ ఉండ‌దు.. అక్క‌డ డోర్లు మూసుకుపోయాయి: సునీల్ న‌రైన్‌

Sunil Narine Says He Won Come Out of Retirement For T20 World Cup
  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో రీఎంట్రీ అసాధ్య‌మ‌న్న విండీస్ ఆల్‌రౌండ‌ర్
  • త‌న‌కు ఆ ఆలోచ‌న లేద‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న సునీల్ న‌రైన్‌
వెస్టిండీస్ ఆల్‌రౌండ‌ర్ సునీల్ న‌రైన్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో రీఎంట్రీ ఇవ్వ‌నున్నాడే వార్త‌ల‌పై తాజాగా స్పందించాడు.  ఆ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని అన్నాడు. ఎట్టిప‌రిస్థితుల‌లో తిరిగి విండీస్ జ‌ట్టులోకి వ‌చ్చేది లేద‌ని స్ప‌ష్టం చేశాడు. రీఎంట్రీకి డోర్లు మూసుకుపోయాయని అన్నాడు. ఈ విష‌య‌మై న‌రైన్ ఒక బ‌హిరంగ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాడు. 

"టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆడాల‌నే అభిమానుల ప్ర‌తిపాద‌న‌ను గౌర‌విస్తాను. అయితే నాకు ఆ ఆలోచ‌న లేదు. ప్ర‌పంచ‌క‌ప్ ఆడే విండీస్ జ‌ట్టుకు నా సంపూర్ణ మ‌ద్ద‌తు ఉంటుంది. మా జ‌ట్టుకు ఆల్ ది బెస్ట్" అని త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నాడు. దీంతో గ‌త కొన్ని రోజులుగా సునీల్ న‌రైన్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆడ‌నున్నాడ‌ని జ‌రుగుతున్న ప్ర‌చారానికి తెర ప‌డిన‌ట్లైంది.

ఇదిలాఉంటే.. ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో న‌రైన్ అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. ఆల్‌రౌండ్ షోతో ఆక‌ట్టుకుంటున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 7 మ్యాచులాడిన ఈ ఆల్‌రౌండ‌ర్ 286 ప‌రుగులు చేశాడు. ఇందులో ఒక శ‌త‌కం, ఒక అర్ధ శ‌త‌కం ఉన్నాయి. అటు బౌలింగ్‌లో కూడా స‌త్తాచాటి 9 వికెట్లు ప‌డ‌గొట్టాడు.
Sunil Narine
T20 World Cup
Team West Indies
Cricket
Sports News

More Telugu News