Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఎక్కిన హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య... నేటి సభలు వాయిదా

  • ఇవాళ తాడేపల్లిగూడెం, ఉంగుటూరులో వారాహి విజయభేరి సభలు
  • పవన్ హెలికాప్టర్ లో కూర్చున్న తర్వాత టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య
  • పర్యటన రద్దు చేసుకున్న పవన్
Pawan Kalyan Helicopter grounded after technical problem

జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి అనుకోని అవాంతరం ఏర్పడింది. ఆయన ఇవాళ తాడేపల్లిగూడెం, ఉంగుటూరులో వారాహి విజయభేరి సభల్లో పాల్గొనాల్సి ఉండగా, చివరి నిమిషంలో ఆ పర్యటన రద్దయింది. 

పిఠాపురం నుంచి తాడేపల్లిగూడెం వెళ్లేందుకు పవన్ కల్యాణ్ హెలికాప్టర్ లో కూర్చోగా, హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇంజిన్ లో సమస్య కారణంగా హెలికాప్టర్ మొరాయించింది. ఈ నేపథ్యంలో, ఇవాళ జరగాల్సిన తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా పడ్డాయి. 

ముందు పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ఈ సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెం సభ, రాత్రి 7 గంటలకు ఉంగుటూరు సభ జరగాల్సి ఉంది. ఈ రెండు  నియోజకవర్గాల్లో సభలను మరో రోజు నిర్వహిస్తారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

More Telugu News