Chandrababu: శ్రీశైలంలో రుద్రాభిషేకం జరిపించిన చంద్రబాబు, భువనేశ్వరి

Chandrababu and Bhuvaneswari performs Rudrabhishekam in Srisailam
  • శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన చంద్రబాబు దంపతులు
  • భ్రమరాంబికా మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు
  • సాక్షి గణపతి, వీరభద్రస్వామి వార్లకు పూజలు

టీడీపీ అధినేత చంద్రబాబు తన అర్ధాంగి నారా భువనేశ్వరి సమేతంగా ఇవాళ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ఇక్కడి భ్రమరాంబికా మల్లికార్జునస్వామివారిని దర్శించుకున్నారు. మహాశివుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, భువనేశ్వరిలకు వేదపండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ పర్యటనలో చంద్రబాబు, భువనేశ్వరి ఇక్కడి సాక్షి గణపతి, వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు రాకతో శ్రీశైలం టీడీపీ శ్రేణుల్లో కోలాహలం నెలకొంది.

  • Loading...

More Telugu News