Burj Khalifa: బుర్జ్ ఖ‌లీఫాపై కాఫీ తాగిన డాలీ ఛాయ్‌వాలా.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

Dolly Chaiwala Enjoys Coffee at Burj Khalifa Video goes Viral on Social Media
  • వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన డాలీ ఛాయ్‌వాలా
  • బుర్జ్ ఖ‌లీఫా 148వ అంత‌స్తుకు చేరుకుని టాప్‌లో కాఫీ ఆస్వాదించిన సోష‌ల్ మీడియా సెన్సేష‌న్
  • ఒక కాఫీ తాగ‌డానికి బుర్జ్ ఖ‌లీఫా టాప్‌కు వెళ్ల‌డం జ‌రిగింద‌నే క్యాప్ష‌న్‌తో వీడియో పోస్ట్ చేసిన వైనం
సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ డాలీ ఛాయ్‌వాలా ఇటీవ‌ల దుబాయ్‌లోని ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన భ‌వంతీ బుర్జ్ ఖ‌లీఫాపై కాఫీ తాగిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను డాలీ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశాడు. దీనికి 'ఒక కాఫీ తాగ‌డానికి బుర్జ్ ఖ‌లీఫా టాప్‌కు వెళ్ల‌డం జ‌రిగింది' అనే క్యాప్ష‌న్‌తో పోస్టు చేశాడు. 

ఇక వీడియోలో డాలీ ఛాయ్‌వాలా ల‌గ్జ‌రీ కారులో బుర్జ్ ఖ‌లీఫా వ‌ద్ద చేరుకోవడం మ‌నం చూడొచ్చు. అనంతరం కొంద‌రు అధికారులు అత‌డికి స్వాగ‌తం ప‌లికారు. వారితో క‌లిసి అత‌డు బుర్జ్ ఖ‌లీఫా 148వ అంత‌స్తుకు చేరుకుని అక్క‌డి నుంచి వ్యూని ఎంజాయ్ చేశారు. అనంత‌రం ఆ టాప్‌లోనే కూర్చొని కాఫీని ఆస్వాదించ‌డం వీడియోలో ఉంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.
Burj Khalifa
Dolly Chaiwala
Coffee
Instagram
Social Media

More Telugu News