Karun Nair: ఇంగ్లండ్ కౌంటీలో డ‌బుల్ సెంచరీతో మెరిసిన టీమిండియా క్రికెట‌ర్‌

Team India Cricketer Karun Nair discard slams a double hundred in England
  • నార్తంప్ట‌న్‌షైర్ కౌంటీ త‌ర‌ఫున ఆడుతున్న క‌రుణ్ నాయ‌ర్
  • గ్లామోర్గన్‌తో జ‌రుగుతున్న మ్యాచులో మెరుపు డ‌బుల్ సెంచ‌రీ (253 బంతుల్లో 202 ప‌రుగులు)
  • అత‌ని ఇన్నింగ్స్‌లో 21 బౌండ‌రీలు, 2 సిక్స‌ర్లు
భార‌త జ‌ట్టులో స‌రైన అవ‌కాశాలు రాక‌పోవ‌డం, ఐపీఎల్‌లో ఏ జ‌ట్టు తీసుకోక‌పోవ‌డంతో టీమిండియా ప్లేయ‌ర్ క‌రుణ్ నాయ‌ర్ ప్ర‌స్తుతం కౌంటీల్లో ఆడుతున్నాడు. నార్తంప్ట‌న్‌షైర్ కౌంటీ త‌ర‌ఫున ఆడుతున్న ఈ ఆట‌గాడు ప్ర‌స్తుతం ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. తాజాగా విటాలిటీ కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్-2లో భాగంగా గ్లామోర్గన్‌తో జ‌రుగుతున్న మ్యాచులో క‌రుణ్ మ‌రోసారి బ్యాట్ ఝ‌ళిపించాడు. 

మెరుపు డ‌బుల్ సెంచ‌రీ (253 బంతుల్లో 202 ప‌రుగులు)తో మెరిశాడు. క‌రుణ్ నాయ‌ర్ ఇన్నింగ్స్‌లో 21 బౌండ‌రీలు, 2 సిక్స‌ర్లు ఉండ‌డం విశేషం. దీంతో నార్తంప్ట‌న్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల న‌ష్టానికి 605 ప‌రుగుల వ‌ద్ద డిక్లేర్ చేసింది. సైఫ్ జైబ్ శ‌త‌కం (100) తో క‌లిసి క‌రుణ్ ఆరో వికెట్‌కు 212 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించాడు. 

కరుణ్ నాయ‌ర్ క్రికెట్ కెరీర్ విష‌యానికి వ‌స్తే..
100 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో కరుణ్ నాయ‌ర్‌ 48.34 సగటుతో 6962 పరుగులు చేశాడు. ఇందులో 18 సెంచరీలు, 32 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అలాగే ఈ కుడిచేతి వాటం బ్యాటర్ భారత్ తరఫున 6 టెస్టుల్లో 374 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అత‌ను 62.33 సగటును క‌లిగి ఉండ‌డం విశేషం. కాగా, టీమిండియా త‌ర‌ఫున తాను ఆడిన మూడో టెస్టులోనే ట్రిపుల్ సెంచ‌రీ చేసి సంచ‌ల‌నం సృష్టించాడు. 
Karun Nair
Team India
Northamptonshire
England
Cricket
Sports News

More Telugu News