AAP MP Sanjay Singh: బిన్ లాడెన్ అహింస గురించి చెప్పినట్లుంది: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్

  • అవినీతి గురించి మోదీ మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా
  • రాంచీలో జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో ప్రసంగం
  • ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించిన సంజయ్
PM talking about corruption like Osama bin Laden preaching non violence AAP leader

అవినీతి గురించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడడం.. బిన్ లాడెన్ అహింస గురించి ప్రసంగించినట్లు ఉందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను, ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ను తప్పుడు ఆరోపణలతో జైలుకు పంపించి, ఇప్పుడు తీరిగ్గా అవినీతికి వ్యతిరేకంగా మోదీ మాట్లాడుతున్నారంటూ మోదీపై విరుచుకుపడ్డారు. ఈమేరకు ఆదివారం ఝార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో సంజయ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై, కేంద్ర ప్రభుత్వంపై పలు ఆరోపణలు గుప్పించారు.

ప్రతిపక్ష నేతలపై పెట్టిన అవినీతి కేసులు వాళ్లు పార్టీ మారి బీజేపీలో చేరగానే మాఫీ అయిపోతున్నాయని ఆరోపించారు. 2014 లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక మోదీ వాషింగ్ పౌడర్ తయారు చేశారని, ఈ పౌడర్ నేతల అవినీతి మరకలను చిటికెలో తొలగిస్తోందని ఎద్దేవా చేశారు. బీజేపీలో చేరిన వెంటనే ఈ వాషింగ్ పౌడర్ పని మొదలుపెట్టి నిమిషాల్లో అవినీతి మరకలను తుడిచేస్తుందంటూ సంజయ్ సింగ్ విమర్శించారు. అవినీతి ఆరోపణల తీవ్రతను బట్టి బీజేపీలో ఆయా నేతలకు ప్రాధాన్యం దక్కుతుందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు.

More Telugu News