Shivani Parihar: బంధుమిత్రుల సమక్షంలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని వివాహమాడిన యువతి.. వీడియో ఇదిగో!

Gwalior Girl Shivani Parihar Dedicated Her Life to Lord Krishna
  • మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘటన
  • చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ వచ్చిన శివానీ
  • పెద్దలను ఒప్పించి ఘనంగా వివాహం
  • బృందావనం నుంచి మేళతాళాలతో వచ్చిన శ్రీకృష్ణుడి విగ్రహం
  • వివాహానంతరం అప్పగింతల కార్యక్రమం
చిన్నప్పటి నుంచి ఆరాధించిన శ్రీకృష్ణుడిని ఓ యువతి వేదమంత్రాల సాక్షిగా వివాహం చేసుకుంది. మధ్యప్రదేశ్‌‌లోని గ్వాలియర్‌లో జరిగిందీ ఘటన. శివానీ పరిహార్‌(23)కు శ్రీకృష్ణుడంటే చిన్నప్పటి నుంచి విపరీతమైన భక్తి. తనతోపాటే అది పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఆయననే పెళ్లి చేసుకోవాలని భావించింది. విషయాన్ని ఇంట్లో చెప్పి తల్లిదండ్రులను ఒప్పించింది.

బుధవారం శ్రీకృష్ణుడి విగ్రహాన్ని (లడ్డూ గోపాల్‌జీజ) బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకుంది. వేదమంత్రాల సాక్షిగా జరిగిన ఈ పెళ్లి అనంతరం వధువుకు అప్పగింతల కార్యక్రమం కూడా నిర్వహించారు. అంతకుముందు వరుడు శ్రీకృష్ణుడి విగ్రహం బృందావనం నుంచి బ్యాండు మేళాలతో ఊరేగింపుగా వచ్చింది. అనంతరం స్థానిక ఆలయంలో పెళ్లి ఘనంగా జరిగింది. వివాహానంతరం శివానీ వివాహ ప్రమాణ పత్రం కూడా అందుకుంది. అనంతరం శ్రీకృష్ణుడి విగ్రహంతో కలిసి బృందావనం బయలుదేరింది. అక్కడి రాధా ధ్యాన్ ఆశ్రమంలో శ్రీకృష్ణుడి సేవలో తన తదుపరి జీవితాన్ని గడపనుంది.

Shivani Parihar
Lork Krishna
Madhya Pradesh
Gwalior

More Telugu News