Raghu Rama Krishna Raju: రాజర్షి చంద్రబాబుకు ఇవే నా జన్మదిన శుభాకాంక్షలు: రఘురామకృష్ణరాజు

Raghu Raju birthday wishes to Chandrababu
  • నేడు చంద్రబాబు జన్మదినం
  • జాతి గర్వపడే నాయకుడు చంద్రబాబు అన్న రఘురాజు
  • రేపటి తరాల భవితను తీర్చిదిద్దే మహాశిల్పి అని కితాబు

టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఎంపీ రఘురామకృష్ణరాజు ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేతలు ఎంత మంది ఉన్నా... జాతి గర్వపడే నాయకులు కొందరే ఉంటారని రఘురాజు అన్నారు. ఆ కొందరిలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉంటారని చెప్పారు. చంద్రబాబు నాయుడు అంటే కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదని... ఆయన ఒక అనితరసాధ్యుడని, అద్వితీయ దార్శనికుడని, తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడని, రేపటి తరాల భవితను తీర్చిదిద్దే మహాశిల్పి అని కొనియాడారు. అలాంటి రాజర్షికి ఇవే నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పారు. చంద్రబాబుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.

  • Loading...

More Telugu News