principal: స్కూల్లో ప్రిన్సిపాల్ ఫేషియల్.. వీడియో తీసిన టీచర్ చెయ్యి కొరికిన వైనం

Principal Gets Facial Done In School Bites Teacher Who Caught Her
  • ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో ఉన్న ప్రైమరీ స్కూల్లో ఘటన
  • కేసు నమోదు చేసిన పోలీసులు
  • ఘటనపై విచారణకు ఆదేశించిన విద్యాశాఖ అధికారి
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో ఉన్న ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్కూల్ హెడ్ మిస్ట్రెస్ నిర్వాకం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తన వీడియో తీసిన టీచర్ పై హెడ్ మిస్ట్రెస్ దాడి చేయడమే కాకుండా రక్తం కారేలా చెయ్యి కొరికడం గమనార్హం. దీనిపై బాధిత టీచర్ ఫిర్యాదుతో పోలీసు కేసు నమోదైంది. ఈ ఘటనపై విద్యా శాఖ అధికారి విచారణకు ఆదేశించారు.

ఏం జరిగిందంటే..
అసిస్టెంట్ టీచర్ గా పనిచేస్తున్న ఆనమ్ ఖాన్.. స్కూల్లోని వంట గదిని వీడియో తీస్తూ ముందుకు కదిలింది. ఆ పక్కనే సంగీతా సింగ్ అనే హెడ్ మిస్ట్రెస్ మరో మహిళ సాయంతో ముఖానికి ఫేషియల్ వేయించుకోవడాన్ని షూట్ చేసింది. వెరీ గుడ్ అంటూ ఆమె కామెంట్ చేయగానే ఒక్కసారిగా సంగీతా సింగ్ కుర్చీలోంచి లేచింది. వీడియో అంతటితో ఆగిపోగా ఆ తర్వాత  సంగీతాసింగ్ తనపై దాడి చేసిందని, రక్తం కారేలా చెయ్యి కొరికిందని ఆనమ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత టీచర్ కు వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు హెడ్ మిస్ట్రెస్ పై కేసు నమోదు చేశారు.
principal
bites
teacher
facial

More Telugu News