చెలరేగిన సూర్యకుమార్ యాదవ్... ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు
- ముల్లన్ పూర్ లో ముంబయి ఇండియన్స్ × పంజాబ్ కింగ్స్
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి
- నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు
- 53 బంతుల్లో 78 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్
'మిస్టర్ 360' సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన బ్యాటింగ్ స్పెషాలిటీ ప్రదర్శించాడు. సూర్య 53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 78 పరుగులు చేశాడు. తెలుగుతేజం తిలక్ వర్మ 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 34 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రోహిత్ శర్మ 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 36 పరుగులు సాధించాడు.
పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, కెప్టెన్ శామ్ కరన్ 2, కగిసో రబాడా 1 వికెట్ తీశారు.