NASA: చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నాసా

NASA suspects China space programs
  • చంద్రుడిపై పరిశోధనల్లో అమెరికా, చైనా మధ్య పోటీ
  • చైనా భారీ బడ్జెట్ కేటాయింపులు చేసిందన్న నాసా అధిపతి
  • గత పదేళ్లుగా చైనా రహస్య ఆపరేషన్లు అమలు చేస్తోందని వెల్లడి
  • అమెరికా జాగ్రత్త పడడం మంచిదని సూచన

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చీఫ్ బిల్ నెల్సన్ తమ దేశ చట్టసభకు తెలియజేసిన కొన్ని విషయాలు అత్యంత ఆసక్తి కలిగిస్తున్నాయి. గత కొంతకాలంగా చైనా చేపడుతున్న అంతరిక్ష కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నాయని నెల్సన్ వెల్లడించారు. 

గత పదేళ్ల కాలంలో చైనా రోదసి రంగంలో అసాధారణ పురోగతి నమోదు చేసిందని, అయితే చైనా ఇదంతా రహస్యంగా ఉంచడం ఆందోళన కలిగించే విషయమని తెలిపారు. 

ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చంద్రుడిపై అమెరికా జెండా ఎగరేయాల్సిన అవసరం ఉందని, లేదంటే చంద్రుడు తన సొత్తు అని చైనా అడ్డంతిరిగే అవకాశం ఉందని బిల్ నెల్సన్ హెచ్చరించారు. చంద్రుడిపై చైనా ఆధిపత్యం అందుకోకముందే అమెరికా జాగ్రత్త పడడం మంచిదని సూచించారు. 

చంద్రుడిపై పరిశోధనల పేరిట చైనా తన బడ్జెట్ లో మునుపెన్నడూ లేనంత భారీ కేటాయింపులు చేస్తుండడం సందేహాలు రేకెత్తిస్తోందని నెల్సన్ వివరించారు. పైగా, పౌర ప్రయోజనాల కోసం అంతరిక్ష పరిశోధనలు చేపడుతున్నామన్న ముసుగులో చైనా సైనిక ప్రాజెక్టులు చేపట్టినట్టు తెలుస్తోందని అన్నారు. అమెరికా అన్ని విధాలా సంసిద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితులు ఎత్తిచూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News