Mumbai Indians: ఐపీఎల్: పంజాబ్ తో ముంబయి ఢీ... రెండు జట్లకు నేటి మ్యాచ్ కీలకం

Mumbai Indians takes of Punjab Kings
  • ముల్లన్ పూర్ లో పంజాబ్ కింగ్స్ × ముంబయి ఇండియన్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
  • ముంబయికి మొదట బ్యాటింగ్ 
ఐపీఎల్ లో ఇవాళ ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఛండీగఢ్ సమీపంలోని ముల్లన్ పూర్ లో ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. 

శిఖర్ ధావన్ గైర్హాజరీలో పంజాబ్ జట్టుకు మరోసారి శామ్ కరన్ సారథ్యం వహిస్తున్నాడు. గాయంతో బాధపడుతున్న కెప్టెన్ శిఖర్ ధావన్ స్థానంలో హార్డ్ హిట్టర్ రిలీ రూసో జట్టులోకి వచ్చాడు. మరోవైపు, ముంబయి ఇండియన్స్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. 

టోర్నీలో ఇప్పటిదాకా ముంబయి ఇండియన్స్ 6 మ్యాచ్ లు ఆడి 2 విజయాలు సాధించింది. పంజాబ్ కింగ్స్ పరిస్థితి కూడా అంతే. 6 మ్యాచ్ ల్లో 2 విజయాలు నమోదు చేసింది. దాంతో నేటి మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారింది.
Mumbai Indians
Punjab Kings
Toss
IPL 2024

More Telugu News