Nagendra Babu: ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఒక్క అవ‌కాశం ఇవ్వండి: నాగ‌బాబు

Janasena Leader Nagendra Babu Road Show in Pithapuram
  • పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని గొల్ల‌ప్రోలులో నాగ‌బాబు రోడ్ షో
  • పిఠాపురం నుంచి జ‌న‌సేనానిని భారీ మెజారిటీతో గెలిపించాల‌న్న‌ నాగ‌బాబు
  • ప‌వ‌న్ గెలిస్తే పిఠాపురం అభివృద్ధి త‌మ బాధ్య‌త అని హామీ
జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సోద‌రుడు, జన‌సేన రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కొణిదెల నాగ‌బాబు పిఠాపురం నుంచి ప‌వ‌న్‌కు ఒక్క‌సారి ఎమ్మెల్యేగా అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని గొల్ల‌ప్రోలులో నాగ‌బాబు బుధ‌వారం నిర్వ‌హించిన‌ రోడ్ షోలో ఆయ‌న ఈ మేరకు అక్క‌డి ఓట‌ర్ల‌ను విజ్ఞ‌ప్తి చేశారు. 

ఇక ఈ రోడ్ షోలో నాగ‌బాబుకు గొల్ల‌ప్రోలు మ‌హిళ‌లు హార‌తులు ప‌ట్టి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. జ‌న‌సేనానిని పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలిపించాల‌ని అభ్య‌ర్థించారు. ప‌వ‌న్ గెలిస్తే పిఠాపురం అభివృద్ధి త‌మ బాధ్య‌త అని హామీ ఇచ్చారు. పిఠాపురం నుంచి భారీ మొత్తంలో బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు మోటార్ సైకిళ్ల‌పై వెళ్లి ఈ రోడ్ షోను విజ‌య‌వంతం చేశారు. ఈ కార్య‌క్రమంలో బీజేపీ పిఠాపురం ఇన్‌ఛార్జి కృష్ణంరాజు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.
Nagendra Babu
Janasena
Pawan Kalyan
Pithapuram

More Telugu News