My Dear Donga: ఆహాలోకి అడుగుపెడుతున్న 'మై డియర్ దొంగ'

My Dear Donga Movie Update
  • అభినవ్ గోమఠం హీరోగా 'మై డియర్ దొంగ'
  • ఆయన జోడీగా కనిపించనున్న షాలినీ 
  • కామెడీ ఎంటర్టైనర్ జోనర్లో నడిచే కథ 
  • రేపటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న కంటెంట్
ఈ మధ్య కాలంలో అభినవ్ గోమఠం తనకి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఒక వైపున తాను ప్రధానమైన పాత్రగా కనిపించే సినిమాలు చేస్తూ, మరో వైపున హీరో ఫ్రెండ్స్ పాత్రలతో మెప్పిస్తూ .. ఇంకో వైపున వెబ్ సిరీస్ లతోను దూసుకుపోతున్నాడు. రీసెంటుగా వచ్చిన 'సేవ్ ద టైగర్స్' సిరీస్ విశేషమైన ఆదరణ పొందిన సంగతి తెలిసందే. 

అలాంటి అభినవ్ ప్రధానమైన పాత్రధారిగా 'మై డియర్ దొంగ' సినిమా రూపొందింది. సర్వజ్ఞ కుమార్  దర్శకత్వం వహించిన ఈ సినిమాను చంద్ర - అభిలాష్ -మహేశ్ నిర్మించారు. ఈ సినిమా రేపు 'ఆహా' ద్వారా స్ట్రీమింగ్ కానుంది. టైటిల్ ను బట్టే ఇది కామెడీ టచ్ తో సాగుతుందనే విషయం అర్థమైపోతూనే ఉంది.

 ఈ సినిమాలో కథానాయిక పాత్రలో కనిపించిన షాలినీయే కథను అందించడం విశేషం. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందింది. దొంగతనం కోసం ఒక అమ్మాయి ఇంటికి వెళ్లిన కథానాయకుడు, అక్కడ ఎలా చిక్కుబడిపోయాడు? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేదే కథ. అజయ్ అరసాడ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఏ స్థాయిలో ఆడియన్స్ ను మెప్పిస్తుందనేది చూడాలి. 
My Dear Donga
Abhinav
Shalini
Divya Sripada

More Telugu News