Ravi Kishan: నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్‌ను తన భర్తగా పేర్కొన్న మహిళపై ఎఫ్ఐఆర్

Case Against Woman Who Claims Ravi Kishan Is Her Daughters Father
  • రూ. 20 కోట్లు ఇవ్వకుంటే రేప్‌ కేసు పెట్టి బజారుకు ఈడుస్తానని అపర్ణ బెదిరింపు
  • తనకు అండర్‌ వరల్డ్‌తో సంబంధాలున్నాయని హెచ్చరిక
  • అపర్ణ, ఆమె భర్త, కొడుకు, కూతురు, ఎస్పీ నేత, జర్నలిస్ట్‌పై కేసు

ప్రముఖ నటుడు, బీజేపీ గోరఖ్‌పూర్ ఎంపీ రవికిషన్ శుక్లాను తన కుమార్తెకు తండ్రిగా ఆరోపించిన మహిళ సహా ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. రవికిషన్ భార్య ప్రీతి శుక్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు హజ్రత్‌గంజ్ పోలీసులు తెలిపారు.  

నిందితురాలు అపర్ణ ఠాకూర్‌తోపాటు ఆమె భర్త రాజేశ్ సోనీ, కుమార్తె షెనోవా సోనీ, కుమారుడు సోనక్ సోనీ, సమాజ్‌వాదీ పార్టీ నేత వివేక్ కుమార్ పాండే, జర్నలిస్ట్ ఖుర్షీద్‌ఖాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదైనట్టు పోలీసులు పేర్కొన్నారు. వీరందరిపై బెదిరింపుల ద్వారా దోపిడీ, బెదిరించి దోపిడీ, ఉద్దేశపూర్వక అవమానం, నేరపూరిత బెదిరింపు వంటి అభియోగాలపై కేసు నమోదైంది. 

అండర్ వరల్డ్‌తో తనకు సంబంధాలున్నాయని అపర్ణ ఠాకూర్ తనను బెదిరించిందని, రూ. 20 కోట్లు ఇవ్వకుంటే అత్యాచారం కేసు పెట్టి రవికిషన్‌ను బజారుకు ఈడుస్తానని హెచ్చరించినట్టు ఎంపీ భార్య తన ఫిర్యాదులో ఆరోపించారు. భోజ్‌పురి నటుడు అయిన రవికిషన్ పలు తెలుగు సినిమాల్లోనూ నటించారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన గోరఖ్‌పూర్ నుంచే ఈసారి కూడా బరిలో నిలిచారు.

  • Loading...

More Telugu News