IPL: ఐపీఎల్ లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో ఢీ... మొదట్లోనే 4 వికెట్లు కోల్పోయిన గుజరాత్

Gujarat Titans lost two early wickets against Delhi Capitals
  • అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ × ఢిల్లీ క్యాపిటల్స్
  • వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన గుజరాత్ టైటాన్స్
  • సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగిన గిల్, సాహా
  • రనౌట్ అయిన సాయి సుదర్శన్
ఐపీఎల్ లో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఢీ కొంటున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకోగా, గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కు దిగింది. అయితే ఆరంభంలోనే 5 వికెట్లు కోల్పోయింది.

గుజరాత్ కెప్టెన్ శుభ్ మాన్ గిల్ రెండో ఓవర్లోనే అవుటయ్యాడు. గిల్ 6 బంతుల్లో 8 పరుగులు చేశాడు. రెండు ఫోర్లు కొట్టి ఊపుమీదున్నట్టు కనిపించిన గిల్ ను ఇషాంత్ శర్మ అవుట్ చేశాడు. మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (2) కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరగడంతో గుజరాత్ కష్టాల్లో పడింది. సాహా వికెట్ ముఖేశ్ కుమార్ ఖాతాలో చేరింది. ఆ తర్వాత సాయి సుదర్శన్ (12) రనౌట్ అయ్యాడు. డేవిడ్ మిల్లర్ (2) సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. మిల్లర్... ఇషాంత్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 5 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. అభినవ్ మనోహర్, తెవాటియా క్రీజులో ఉన్నారు.
IPL
Gujarat Titans
Delhi Capitals
Ahmedabad

More Telugu News