Rajaiah: బిడ్డా... కడియం శ్రీహరి ఇక కాస్కో: మాజీ మంత్రి రాజయ్య

Former Minister rajaiah lashes out at Kadiam Srihari
  • దమ్ముంటే ఘనపూర్‌లో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని నిలదీత
  • దోచుకున్న అక్రమ ఆస్తిని మలేసియా, సింగపూర్‌లలో కూడబెడుతున్నారని విమర్శ
  • కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు వసూలు చేసిన చరిత్ర కడియం శ్రీహరిది అని వ్యాఖ్య

'బిడ్డా కడియం శ్రీహరి... కాస్కో, ఇక మన మధ్య కబడ్డీ.. కబడ్డే... తగ్గేదే లేదు' అని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కడియం శ్రీహరికి దమ్ముంటే స్టేషన్ ఘనపూర్‌లో ఆయన హయాంలో చేసిన అభివృద్ధి చూపించాలని సవాల్ చేశారు. విదేశాల్లో ఆయనకు ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు. అక్రమ ఆస్తులకు కడియం కావ్య, ఆమె భర్త నజీర్ బినామీలు అన్నారు.

ఇక్కడ దోచుకున్న అక్రమ ఆస్తిని మలేసియా, సింగపూర్‌లలో కూడబెడుతున్నారన్నారు. డబ్బును హవాలా రూపంలో విదేశాలకు తరలించారని ఆరోపించారు. కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు వసూలు చేసిన చరిత్ర కడియం శ్రీహరిది అన్నారు. ఎన్‌కౌంటర్లు చేయించారని మండిపడ్డారు. ఆయన పేకాటలో దొరికితే పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టలేదా? అన్నది చెప్పాలన్నారు.

  • Loading...

More Telugu News