Aghora: నంద్యాల టీడీపీ ఆఫీసులో అఘోరా... ఫరూక్ దే విజయం అంటూ జోస్యం... వీడియో ఇదిగో!

Aghora entered into Nandyal TDP office and said Farooq will be the winner in electiona
  • నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్ఎండీ ఫరూక్
  • కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తుండగా ఎంట్రీ ఇచ్చిన అఘోరా
  • నేరుగా ఫరూక్ తోనే మాట్లాడిన అఘోరా
  • ఎమ్మెల్యేగా గెలవడమే కాదు మంత్రివి కూడా అవుతావంటూ దీవెనలు
ఈసారి ఎన్నికల్లో నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ బరిలో ఉన్నారు. విజయం కోసం ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా ఆయన నంద్యాల టీడీపీ ఆఫీసులో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తుండగా, ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. 

ఒంటిపై చిన్న కండువా మాత్రమే ధరించి ఉన్న ఓ అఘోరా టీడీపీ ఆఫీసులోకి ప్రవేశించారు. శరీరానికి బూడిద పూసుకుని, మెడలో రుద్రాక్షలు ధరించి ఉన్న అఘోరా నేరుగా వచ్చి ఫరూక్ తో మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో నీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు అంటూ దీవించారు. 

ఎన్ని అడ్డంకులు ఎదురైనా నువ్వే గెలుస్తావు అంటూ ఆశీస్సులు అందించారు. ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, మంత్రివి కూడా అవుతావు అంటూ జోస్యం చెప్పారు. అక్కడున్న కార్యకర్తలు మొదట ఆ అఘోరాను చూసి భయపడినా, ఆయన తమ నేత ఫరూక్ విజయం సాధిస్తాడని చెప్పడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
Aghora
NMD Farooq
Nandyal
TDP
Andhra Pradesh

More Telugu News