Kannappa: కన్నప్పలో బాలీవుడ్ స్టార్ హీరో.. పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేసిన చిత్రబృందం

Bollywood star hero in Manchu Vishnu Kannnappa video released
  • మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా రూపొందుతున్న ‘కన్నప్ప’
  • బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్‌ను పరిచయం చేసిన చిత్రబృందం
  • శివుడి పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం
  • కన్నప్పలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, శరత్‌కుమార్ వంటి స్టార్లు
  • ప్రభాస్, నయనతార కూడా
టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లో వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌కు చెందిన మరో స్టార్ హీరోను చిత్రబృందం పరిచయం చేసింది. ఆ  స్టార్ నటుడు మరెవరో కాదు.. అక్షయ్ కుమార్. 

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌ను టాలీవుడ్‌లోకి స్వాగతం పలుకుతున్నందుకు ఆనందంగా ఉందంటూ చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది. కన్నప్ప సినిమాలో ఆయన భాగం కావడం థ్రిల్‌గా ఉందని, మర్చిపోలేని సాహసానికి సిద్ధంగా ఉండాలని కోరింది. ఇటీవల ‘ఓ మైగాడ్2’లో శివుడిగా కనిపించిన అక్షయ్ కుమార్ కన్నప్పలోనూ అదే పాత్రలో కనిపించబోతున్నట్టు ప్రచారం జరుగుతున్నా స్పష్టత లేదు.

కాగా, కన్నప్పలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, శరత్‌కుమార్ నటిస్తుండగా విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్రభాస్, నయనతార కూడా నటిస్తున్నట్టు సమాచారం. భరతనాట్య కళాకారిణి ప్రీతి హీరోయిన్‌గా కనిపించనున్నారు.
Kannappa
Akshay Kumar
Bollywood
Tollywood
Manchu Vishnu
Mohan Babu

More Telugu News