oneplus: వన్‌ప్లస్‌ 11 5జీ స్మార్ట్ ఫోన్ పై రూ. 5 వేల తగ్గింపు

one plus 5g new model price
  • ఇక రూ. 51,999కే అందుబాటులోకి స్మార్ట్ ఫోన్
  • వరుసగా రెండోసారి తగ్గింపు ఆఫర్
  • 25 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ చార్జింగ్ కు వీలు
చైనాకు చెందిన ప్రముఖ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. వన్‌ప్లస్‌ 11 5జీ మోడల్ స్మార్ట్ ఫోన్ ధరను మరోసారి తగ్గించింది. ఇటీవలే దీని ధరను రూ.2,000 మేర తగ్గించిన కంపెనీ... తాజాగా ఆ మోడల్ పై మరో రూ. 3,000 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ మొత్తంగా రూ.5,000 తగ్గి రూ.51,999కే అందుబాటులోకి వచ్చింది.

బ్యాంకు కార్డులతో కొంటే తక్షణ డిస్కౌంట్
వన్‌ప్లస్‌ 11 5జీ మోడల్‌పై కంపెనీ మరికొన్ని ఆఫర్లను కూడా అందిస్తోంది. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా ఈ ఫోన్ కొనే కస్టమర్లకు రూ. 3,000 మేర తక్షణ డిస్కౌంట్ ఇస్తోంది. దీంతో ఫోన్‌ రూ.48,999కే లభించనుంది. ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ కింద మరో రూ.5,000 వరకు తగ్గొచ్చని కంపెనీ తెలిపింది.

ఎన్నో అధునాతన ఫీచర్స్
ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్‌ రేటుతో కూడిన 6.7 అంగుళాల క్వాడ్‌ హెచ్‌డీ+ ఈ4 డిస్‌ప్లే ను కంపెనీ అందిస్తోంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌ 13తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌ను కంపెనీ ఇందులో వాడింది. ఈ ఫోన్ వెనుక వైపు 50 ఎంపీ మెయిన్‌ సెన్సర్‌ + ఓఐఎస్‌, 48 ఎంపీ అల్ట్రావైడ్‌ లెన్స్‌, 32 టెలిఫొటోతో కూడిన ట్రిపుల్‌ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరాను కూడా ఇందులో అమర్చారు. 100 వాట్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇందులో ఉంది. కేవలం 25 నిమిషాల్లోనే 100 శాతం బ్యాటరీ చార్జ్‌ అవుతుందని కంపెనీ చెబుతోంది.
oneplus
5g smartphone
offer price
5000 discount

More Telugu News