Tamilnadu: ఉదయాన్నే తమిళనాడు ఎంపీ అభ్యర్థి ప్రచారం.. వాకర్స్ కు జ్యూస్ ఆఫర్!

Tamilnadu MP candidate murosoli serves fruit juice to voters early morning
  • ఓట్ల కోసం తమిళనాడు డీఎంకే అభ్యర్థి మురసోలి వినూత్న ప్రచారం
  • తంజావూరు నియోజకవర్గంలో ఉదయాన్నే ప్రచారం ప్రారంభించిన వైనం
  • వాకింగ్‌కు వచ్చిన వారితో మాటలు కలిపి ఓట్లు కోరిన మురసోలి
  • సైక్లింగ్ చేస్తూ, హెర్బల్ జ్యూస్‌ ఆఫర్ చేస్తూ ఓటర్ల కరుణ కోసం పాట్లు
ఎన్నికల వేళ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు ప్రచారాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. దుస్తులు ఇస్త్రీ చేస్తూ, పచారీ సమాన్లు అమ్ముతూ, అంట్లు తోముతూ, దోశలు వేస్తూ ప్రజల మద్దతు కూడబెట్టేందుకు ఆపసోపాలు పడుతున్నారు. తాజాగా తమిళనాడు అధికార డీఎంకే అభ్యర్థి మురసోలి కూడా శక్తివంచన లేకుండా ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. తంజావూరు నియోజకవర్గంలో ఉదయాన్నే ప్రచారం ప్రారంభించిన ఆయన మార్నింగ్ వాక్ చేసే వారితో మాటకలిపి ఓట్లు అభ్యర్ధించారు. సైక్లింగ్ కూడా చేసిన ఆయన దారిలో కొందరికి హెర్బల్ జ్యూస్ కూడా ఆఫర్ చేశారు.
Tamilnadu
Election Campaign
Viral Videos

More Telugu News